గాలి వార్తలను పట్టించుకోం
బాల్‌టాంపరింగ్ కథనాలపై కోచ్ కుంబ్లే
మొహాలీ: తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనాలను కోచ్ అనిల్ కుంబ్లే తోసిపుచ్చారు. ఇలాంటి గాలి వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘మీడియాలో వచ్చిన వార్తపై నేను స్పందించాలనుకోవడం లేదు. దానిపై చింతించాల్సిన అవసరమే లేదు.
కొందరు వారేమనుకుంటున్నారో అదే మీడియాలో రాస్తారు. నాకు సంబంధించిన వరకు మా ఆటగాళ్లెవరూ అలాంటి చర్యలకు పాల్పడలేదు. అసలు ఈ విషయంలో మాట్లాడేందుకు అంపైర్, రిఫరీ ఎవరూ మా దగ్గరికి రాలేదు. అందుకే ఇలాంటి కథనాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు’ అని కుంబ్లే స్పష్టం చేశారు.