Coach Anil Kumble
-
రంజీ ఆటగాళ్ల ఫీజులను పెంచండి
న్యూఢిల్లీ: రంజీ ఆటగాళ్ల ఫీజులను పెంచే విషయంపై నూతన పరిపాలక కమిటీ (సీఓఏ)తో మాట్లాడాలని భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లేను స్పిన్నర్ హర్భజన్ కోరాడు. ఈనెల 21న సీఓఏకు భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల వేతనాల సవరింపుపై కుంబ్లే నివేదిక ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో రంజీ ఆటగాళ్ల గురించి కూడా మాట్లాడాలని భజ్జీ సూచించాడు. రంజీ ఆటగాళ్లలో కొంతమంది ఐపీఎల్ పుణ్యమా అని కోట్లు సంపాదిస్తున్నా సగటు ఆటగాడు మాత్రం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ (రంజీ, దులీప్ ట్రోఫీ)లో మ్యాచ్ ఫీజు కింద లక్షన్నర పొందుతున్నాడు. అదే ఓ టెస్టు ఆటగాడు రూ.15 లక్షలు పొందుతాడు. ఇది ఆటగాళ్లలో ఆర్థికంగా అభద్రతాభావానికి గురిచేస్తోందని కుంబ్లేకు హర్భజన్ ఇటీవల ఓ లేఖ రాశారు. ‘నేను రెండు మూడేళ్లుగా రంజీల్లో ఆడుతున్నాను. ఈ సమయంలో నాతోటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆటగాళ్ల ఆర్థిక ఇబ్బందులను చూసి చలించిపోయాను. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని అర్జిస్తున్న క్రికెట్ బోర్డు ఈ ట్రోఫీ నిర్వహిస్తున్నా ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణం. 2004 నుంచి వీరి ఫీజులో మార్పులు కూడా జరగలేదు. అప్పటి వందకు ఇప్పటి వంద రూపాయలకు తేడా ఎంతో మారింది. ఏడాదికి ఎంత సంపాదిస్తామో కూడా తెలీకుండా వారు జీవితంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకోగలరు? దయచేసి ఈ అసమానతను బీసీసీఐ పెద్దలకు, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, వీరూలాంటి ఆటగాళ్లకు చేరేలా చూడండి’ అని కుంబ్లేకు రాసిన లేఖలో భజ్జీ ఆవేదన చెందాడు. వందల్లో ఉన్న ఆటగాళ్లలో చాలా కొద్దిమందికే ఐపీఎల్ కాంట్రాక్ట్ లభిస్తోందని, అయితే వారు కూడా ప్రొఫెషనల్ ఆటగాళ్లే అని గుర్తుచేశాడు. ఎక్కువ కోరడంలో తప్పు లేదు: గావస్కర్ మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏడాదిలో 81 రోజులపాటు మ్యాచ్‌లు ఆడే దేశవాళీ ఆటగాళ్లు దాదాపు రూ.40 లక్షల వరకు మాత్రమే సంపాదించగలరని అన్నారు. అదే ఓ అనామక ఆటగాడు ఐపీఎల్లో ఆడే 16 మ్యాచ్‌ల్లోనే దాదాపు రూ.4 కోట్ల వరకు వెనకేసుకుంటాడని చెప్పారు. బీసీసీఐకి డబ్బు సంపాదించి పెడుతోంది ఆటగాళ్లే కాబట్టి వారు ఎక్కువ కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. -
దూకుడు తగ్గించాల్సిన అవసరం లేదు!
►ఆటగాళ్లకు తమ గురించి బాగా తెలుసు ►భారత కోచ్ కుంబ్లే వ్యాఖ్య రాంచీ: మైదానంలో సహజసిద్ధమైన దూకుడు ప్రదర్శించే భారత ఆటగాళ్లను తాను నిరోధించే ప్రయత్నం చేయనని జట్టు కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు. అలాంటి అవసరం కూడా లేదని ఆయన అన్నారు. ‘ఆటగాళ్ల నుంచి మేం ఏం ఆశిస్తున్నామో వారు అలాంటి ప్రదర్శన ఇస్తున్నంత కాలం వారిలోని సహజమైన దూకుడును తగ్గించాలని నేను కోరుకోను. ప్రతీ ఆటగాడికి తనకంటూ కొన్ని అలవాట్లు, శైలి ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం. అయినా ఇప్పుడు సిరీస్ 1–1తో సమంగా ఉంది. ఇరు జట్లు తమదైన శైలిలో పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి కాస్త దూకుడు ప్రదర్శించడంలో తప్పు లేదు’ అని కుంబ్లే అభిప్రాయపడ్డారు. డ్రెస్సింగ్‌రూమ్ రివ్యూ వివాదం విషయంలో భారత్ తమ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయంగా కుంబ్లే అభివర్ణించారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పరిణతితో కూడుకుంది. ఆటకు సంరక్షకులుగా ఇరు జట్ల బోర్డులు కూడా క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం ముఖ్యమని భావించాయి. ఆటగాళ్లకు కూడా తమ బాధ్యతలు ఏమిటో బాగా తెలుసు’ అని ‘జంబో’ చెప్పారు. డీఆర్ఎస్ వివాదం తమ ఆటపై ఎలాంటి ప్రభావం చూపించదన్న కుంబ్లే... మూడో టెస్టుకు ముందు కోహ్లి, స్మిత్ కూర్చొని పలు అంశాలు చర్చిస్తారనే విషయాన్ని నిర్ధారించారు. మరోవైపు తనకు డైరెక్టర్ పదవి, ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తారంటూ వచ్చిన వార్తలను తాను కూడా మీడియాలోనే చూశానని, తన వద్దకు అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని కుంబ్లే వివరణ ఇచ్చారు. -
నాయర్ లేదా రహానే?
తుది జట్టు ఎంపిక ఆసక్తికరం జోరు కొనసాగిస్తామన్న కుంబ్లే రెండో రోజూ భారత్ ప్రాక్టీస్ సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ‘ట్రిపుల్ సెంచరీ’తో కరుణ్ నాయర్ సత్తా చాటాడు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో మరో సందేహం లేకుండా అతను తుది జట్టులో ఉండాలి. కానీ భారత కోచ్ అనిల్ కుంబ్లే మాత్రం అది తప్పనిసరి కాదని పరోక్షంగా సూచనలు ఇచ్చారు. నాయర్‌కు ముందు అజింక్య రహానే ఆడిన మ్యాచ్‌లను మరచిపోవద్దని ఆయన అన్నారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల తర్వాత రహానే గాయపడటంతో నాయర్‌కు అవకాశం లభించగా, దానిని అతను పూర్తిగా సద్వినియోగ పరుచుకున్నాడు. ‘తనకు ఇచ్చిన అవకాశాన్ని నాయర్ ఉపయోగించుకోవడం మంచి పరిణామం. ఒక కుర్రాడు ట్రిపుల్ సెంచరీ సాధించడం అభినందించాల్సిన అంశమే. అలాంటి వాళ్లు ఉండటం వల్ల జట్టు బలం ఏమిటో తెలిసింది. అయితే రహానే జట్టుకు ఏం చేశాడో అందరికీ తెలుసు. అన్ని రకాల పరిస్థితుల్లో రహానే అద్భుత ప్రదర్శన కనబర్చాడు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల మధ్య వీరిద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారో చూడాలి. గురువారం నుంచి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కుంబ్లే మీడియాతో మాట్లాడారు. సొంతగడ్డపై తమ జోరును ఈ టెస్టులోనూ కొనసాగిస్తామని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇప్పటి వరకు మేం చాలా బాగా ఆడాం. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతాం. బంగ్లాదేశ్‌తో టెస్టు కోసం మేం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి. దాని ప్రకారం వెళితే కచ్చితంగా విజయం దక్కుతుంది’ అని కుంబ్లే అన్నారు. గతంతో పోలిస్తే బంగ్లాదేశ్ ఎంతో మెరుగైందని, దానిని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఓపెనర్లుగా విజయ్, రాహుల్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, ముందు జాగ్రత్త కోసమే ముకుంద్‌ను తీసుకున్నట్లు కుంబ్లే వెల్లడించారు. ఈ సీజన్లో స్పిన్నర్లతో పాటు మన పేసర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచారన్న కోచ్... అశ్విన్, జడేజాలపై ప్రశంసలు కురిపించారు. టెస్టు ఫార్మాట్లో కూడా మంచి ఆల్‌రౌండర్ అయ్యే లక్షణాలు హార్దిక్ పాండ్యాలో ఉన్నాయని, మున్ముందు అతడిని కూడా పరీక్షించే అవకాశం ఉందని కుంబ్లే వెల్లడించారు. వరుసగా రెండో రోజు కూడా భారత జట్టు ఉప్పల్ స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు సాధన చేసింది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు ప్రధాన మైదానంలో ఆటగాళ్ళంతా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. బంగ్లాదేశ్ జట్టు మాత్రం మంగళవారం విశ్రాంతి తీసుకుంది. ‘మళ్లీ జరగొచ్చు... జరగకపోవచ్చు’ సరిగ్గా 18 ఏళ్ల క్రితం అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. దానిని గుర్తు చేసుకుంటూ కుంబ్లే తన ఆనందం వ్యక్తం చేశారు. ‘అభిమానులు ఇలా వార్షికోత్సవాలు కూడా గుర్తుంచుకోవడం, మేం కూడా వేడుకగా జరుపుకోవడం చాలా బాగుంటుంది. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని 10 వికెట్లు తీస్తానని నేను అసలు ఊహించలేదు. అది అలా జరిగిపోయిందంతే. నాకు రాసి పెట్టి ఉంది. అదో అరుదైన సందర్భం. అయితే భవిష్యత్తులో అలాంటిది మళ్లీ సాధ్యం కావచ్చు లేదా ఎప్పటికీ కాకపోవచ్చు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. అశ్విన్‌కు అచ్చొచ్చిన మైదానం... భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉప్పల్ స్టేడియంలో మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మైదానంలో ఆడిన 2 టెస్టులలో కలిపి అశ్విన్ 18 వికెట్లు పడగొట్టాడు. అతను తన కెరీర్లో తొలిసారి మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టింది ఇక్కడే. పైగా తన శైలికి ఇది సరిగ్గా సరిపోతుందని అతను చెబుతున్నాడు. ‘నేను ఈ స్టేడియాన్ని ఇష్టపడేందుకు ఇక్కడి మంచి రికార్డు ఉండటం ఒక్కటే కారణం కాదు. మొత్తం సౌకర్యాలన్నీ బాగుంటాయి. మంచి పచ్చికతో అవుట్‌ఫీల్డ్ ఆకట్టుకుంటుంది. స్పిన్నర్ల కోణంలో ఇది చాలా పెద్ద మైదానం. బంతిని గాల్లో ఎక్కువ సేపు ఉంచుతూ బౌలింగ్ చేయవచ్చు. వికెట్లో ఉండే బౌన్స్ వల్ల కొత్తగా ప్రయత్నించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని నేను ఇష్టపడతాను’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. పరిశీలకుడిగా రత్నాకర్ శెట్టి... భారత్, బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు బీసీసీఐ జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్మెంట్) రత్నాకర్ శెట్టిని పరిశీలకుడిగా బోర్డు నియమించింది. హెచ్‌సీఏలో గుర్తింపు పొందిన కార్యవర్గం లేకపోవడంతో హైకోర్టు చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శెట్టికి తోడుగా బోర్డు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ రంగ్నేకర్ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. కాచుకో బంగ్లాదేశ్... అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లి గతంలో బంగ్లాదేశ్‌తో ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత కోహ్లికి అదే తొలి టెస్టు కావడం విశేషం. 2015 జూన్‌లో ఫతుల్లాలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఆధిక్యం ప్రదర్శించినా, వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిసింది. విజయ్, ధావన్ శతకాలు బాదిన ఆ మ్యాచ్‌లో కోహ్లి 14 పరుగులు చేసి బౌల్డయ్యాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్ హోదాలో బంగ్లాను విరాట్ ఎదుర్కోబోతున్నాడు. అతని తాజా ఫామ్ నేపథ్యంలో కోహ్లిని బంగ్లా బౌలర్లు అసలు ఆపగలరా! -
గాలి వార్తలను పట్టించుకోం
-
గాలి వార్తలను పట్టించుకోం
బాల్‌టాంపరింగ్ కథనాలపై కోచ్ కుంబ్లే మొహాలీ: తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనాలను కోచ్ అనిల్ కుంబ్లే తోసిపుచ్చారు. ఇలాంటి గాలి వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘మీడియాలో వచ్చిన వార్తపై నేను స్పందించాలనుకోవడం లేదు. దానిపై చింతించాల్సిన అవసరమే లేదు. కొందరు వారేమనుకుంటున్నారో అదే మీడియాలో రాస్తారు. నాకు సంబంధించిన వరకు మా ఆటగాళ్లెవరూ అలాంటి చర్యలకు పాల్పడలేదు. అసలు ఈ విషయంలో మాట్లాడేందుకు అంపైర్, రిఫరీ ఎవరూ మా దగ్గరికి రాలేదు. అందుకే ఇలాంటి కథనాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు’ అని కుంబ్లే స్పష్టం చేశారు. -
ఐదో బౌలరా... ఆరో బ్యాట్స్‌మనా?
జట్టు ఎంపికపై కోచ్ కుంబ్లే సమాలోచన హార్ధిక్ పాండ్యా, కరుణ్ నాయర్లకు మద్దతు రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి టెస్టుకు తుది జట్టు ఎంపిక చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేకు సవాల్‌గా మారింది. ఐదో బౌలర్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోవాలా? లేక ఆరో బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వాలా? అనేది ఇప్పుడు కోచ్ తేల్చాల్సి ఉంది. అరుుతే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇచ్చేదీ ఆయన నేరుగా చెప్పకపోరుునా ఇరువురి ఆటగాళ్లనూ కొనియాడారు. ‘హార్ధిక్ అద్భుత నైపుణ్యం కలిగిన ఆటగాడు. ఐపీఎల్లో అడుగుపెట్టిన సమయంలో తనేంటో నిరూపించుకున్నాడు. అరుుతే పరిమిత ఓవర్ల ఫార్మాట్ టెస్టులతో పోలిస్తే విభిన్నమే అరుునా పాండ్యా శక్తి సామర్థ్యాలేమిటో మనం చూశాం. టి20లో ఆడిన కొద్ది మ్యాచ్‌లు, ధర్మశాల వన్డేలో మూడు వికెట్లు, ఢిల్లీ మ్యాచ్‌లో 30కి పైగా పరుగులు జట్టుకు ఉపయోగపడినవే. అందుకే టెస్టు జట్టులోకి తీసుకున్నాం. అరుుతే మ్యాచ్‌లో ఐదో బౌలర్ ప్రాముఖ్యత మనకు తెలిసిందే. 140కి పైగా వేగంతో బంతులు విసిరి లోయర్ ఆర్డర్లో మంచి బ్యాటింగ్ చేయగలిగితే మంచిదే. అందుకే తనకు అవకాశం దక్కితే స్వేచ్ఛగా ఆడమనే చెబుతాం’ అని కుంబ్లే వివరించారు. ఇక దేశవాళీ మ్యాచ్‌ల్లో కరుణ్ నాయర్ భారీగా పరుగులు సాధించడమే కాకుండా నిలకడను ప్రదర్శించాడని కోచ్ గుర్తుచేశారు. భారత్ ‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగ్గా రాణించకపోరుునా అతడి నిలకడను చూసే కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేశామన్నారు. ఆ తర్వాత రంజీల్లో ఆడి శతకాలు సాధించాడని చెప్పారు. ఇప్పుడు ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో అతడి అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. మరోవైపు ఇంగ్లండ్‌తో ఆడిన తమ చివరి మూడు టెస్టు సిరీస్‌లను భారత్ కోల్పోరుున విషయం తెలిసిందే. అరుుతే అప్పటి జట్లతో పోలిస్తే రెండింటిలోనూ దాదాపుగా కొత్తవారే ఆడుతున్నారని చెప్పారు. ఇటీవల ఎక్కువగా టెస్టులు ఆడడంతో అంతా మంచి టచ్‌లో ఉన్నారని అన్నారు. రాజ్‌కోట్‌లో ఇదే తొలి టెస్టు మ్యాచ్ కనుక బంతి ఎలా స్పందిస్తుందో తెలీదని, మరో రెండు రోజుల తర్వాత జట్టు కూర్పు గురించి ఆలోచిస్తామన్నారు. ‘జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీల్లో ఆడాలి’ గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఎంపిక కావాలంటే... దేశవాళీల్లో ఆడి ఫామ్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కోచ్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జట్టులో రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ గాయాలతో బాధపడుతున్నారు. ‘మేం ఇలాంటి ప్రొటోకాల్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. గాయం నుంచి కోలుకున్న ఆటగాడు కచ్చితంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలి. జాతీయ జట్టులోకి రావడానికి ముందు తను తీవ్ర ఒత్తిడిలో ఆడడం నేర్చుకోవాలి’ అని కుంబ్లే పేర్కొన్నారు. అరుుతే గాయాలతో ఉన్నప్పుడు ఆటగాళ్లతో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకమని ఆయన తెలిపారు. అలాగే వంద శాతం ఫిట్నెస్గా ఉంటేనే జట్టులోకి రావాలని, వేగంగా కోలుకునేందుకు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. అది ఆటగాడికి, జట్టుకు కూడా లాభం చేకూర్చదని గుర్తుచేశారు.