ఐదో బౌలరా... ఆరో బ్యాట్స్‌మనా?
జట్టు ఎంపికపై కోచ్ కుంబ్లే సమాలోచన
హార్ధిక్ పాండ్యా, కరుణ్ నాయర్‌లకు మద్దతు
రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి టెస్టుకు తుది జట్టు ఎంపిక చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేకు సవాల్‌గా మారింది. ఐదో బౌలర్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోవాలా? లేక ఆరో బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వాలా? అనేది ఇప్పుడు కోచ్ తేల్చాల్సి ఉంది. అరుుతే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇచ్చేదీ ఆయన నేరుగా చెప్పకపోరుునా ఇరువురి ఆటగాళ్లనూ కొనియాడారు. ‘హార్ధిక్ అద్భుత నైపుణ్యం కలిగిన ఆటగాడు. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన సమయంలో తనేంటో నిరూపించుకున్నాడు. అరుుతే పరిమిత ఓవర్ల ఫార్మాట్ టెస్టులతో పోలిస్తే విభిన్నమే అరుునా పాండ్యా శక్తి సామర్థ్యాలేమిటో మనం చూశాం. టి20లో ఆడిన కొద్ది మ్యాచ్‌లు, ధర్మశాల వన్డేలో మూడు వికెట్లు, ఢిల్లీ మ్యాచ్‌లో 30కి పైగా పరుగులు జట్టుకు ఉపయోగపడినవే. అందుకే టెస్టు జట్టులోకి తీసుకున్నాం. అరుుతే మ్యాచ్‌లో ఐదో బౌలర్ ప్రాముఖ్యత మనకు తెలిసిందే. 140కి పైగా వేగంతో బంతులు విసిరి లోయర్ ఆర్డర్‌లో మంచి బ్యాటింగ్ చేయగలిగితే మంచిదే. అందుకే తనకు అవకాశం దక్కితే స్వేచ్ఛగా ఆడమనే చెబుతాం’ అని కుంబ్లే వివరించారు. ఇక దేశవాళీ మ్యాచ్‌ల్లో కరుణ్ నాయర్ భారీగా పరుగులు సాధించడమే కాకుండా నిలకడను ప్రదర్శించాడని కోచ్ గుర్తుచేశారు.
భారత్ ‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగ్గా రాణించకపోరుునా అతడి నిలకడను చూసే కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేశామన్నారు. ఆ తర్వాత రంజీల్లో ఆడి శతకాలు సాధించాడని చెప్పారు. ఇప్పుడు ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో అతడి అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. మరోవైపు ఇంగ్లండ్‌తో ఆడిన తమ చివరి మూడు టెస్టు సిరీస్‌లను భారత్ కోల్పోరుున విషయం తెలిసిందే. అరుుతే అప్పటి జట్లతో పోలిస్తే రెండింటిలోనూ దాదాపుగా కొత్తవారే ఆడుతున్నారని చెప్పారు. ఇటీవల ఎక్కువగా టెస్టులు ఆడడంతో అంతా మంచి టచ్‌లో ఉన్నారని అన్నారు. రాజ్‌కోట్‌లో ఇదే తొలి టెస్టు మ్యాచ్ కనుక బంతి ఎలా స్పందిస్తుందో తెలీదని, మరో రెండు రోజుల తర్వాత జట్టు కూర్పు గురించి ఆలోచిస్తామన్నారు.
‘జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీల్లో ఆడాలి’
గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఎంపిక కావాలంటే... దేశవాళీల్లో ఆడి ఫామ్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కోచ్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జట్టులో రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ గాయాలతో బాధపడుతున్నారు. ‘మేం ఇలాంటి ప్రొటోకాల్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. గాయం నుంచి కోలుకున్న ఆటగాడు కచ్చితంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలి. జాతీయ జట్టులోకి రావడానికి ముందు తను తీవ్ర ఒత్తిడిలో ఆడడం నేర్చుకోవాలి’ అని కుంబ్లే పేర్కొన్నారు. అరుుతే గాయాలతో ఉన్నప్పుడు ఆటగాళ్లతో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకమని ఆయన తెలిపారు. అలాగే వంద శాతం ఫిట్‌నెస్‌గా ఉంటేనే జట్టులోకి రావాలని, వేగంగా కోలుకునేందుకు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. అది ఆటగాడికి, జట్టుకు కూడా లాభం చేకూర్చదని గుర్తుచేశారు.