తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనాలను కోచ్ అనిల్ కుంబ్లే తోసిపుచ్చారు. ఇలాంటి గాలి వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘మీడియాలో వచ్చిన వార్తపై నేను స్పందించాలనుకోవడం లేదు. దానిపై చింతించాల్సిన అవసరమే లేదు.