
పారుపల్లి కశ్యప్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశాడు.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో ప్రపంచ నాలుగో నంబర్ క్రీడాకారుడు కెనిచి టాగో(జపాన్)ను కంగుతినిపించాడు.
కెనిచిపై 21-11 21-18 తో విజయం సాధించి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లాడు. 28వ ర్యాంకులో ఉన్న కశ్యప్ తనకన్నా మెరుగైన స్థానంలో ఆటగాడిని 34 నిమిషాల్లో వరుస సెట్లలో ఓడించడం విశేషం.
మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ స్టార్ సైనా నెహ్వాల్ స్థానికి క్రీడాకారిణి సషినా విగ్నెస్ వారాను 21-16 21-9తో ఓడించి రెండో రౌండ్ లో అడుగు పెట్టింది.