దక్షిణాఫ్రికాదే సిరీస్ | Petersen quits international cricket | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాదే సిరీస్

Published Wed, Jan 7 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

దక్షిణాఫ్రికాదే సిరీస్

దక్షిణాఫ్రికాదే సిరీస్

కేప్‌టౌన్: వెస్టిండీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు 2-0తో గెలుచుకుంది. దీంతో పాటు ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా తన ర్యాంకును నిలబెట్టుకుంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (103 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీ సహాయంతో చివరి రోజు మంగళవారం 124 పరుగుల లక్ష్యాన్ని సఫారీ 37.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. డి విలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్,  ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం దక్కింది.  
 
అల్విరో పీటర్సన్ రిటైర్మెంట్: దక్షిణాఫ్రికా ఓపెనర్ అల్విరో పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుత సిరీస్‌ను 2-0తో నెగ్గిన అనంతరం సహచరుల మధ్య తన వీడ్కోలు నిర్ణయం ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement