ప్రాంజల పరాజయం | pranjala defeated in semi final of Itf tourney | Sakshi
Sakshi News home page

ప్రాంజల పరాజయం

Published Sat, Dec 2 2017 10:53 AM | Last Updated on Sat, Dec 2 2017 10:53 AM

pranjala defeated in semi final of Itf tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సెమీఫైనల్లో ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో నాలుగో సీడ్‌ ప్రాంజల 3–6, 5–7తో రెండో సీడ్‌ ఓల్గా డోరోషినా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయిన ప్రాంజల... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement