శ్రీలంకనే గెలిచింది.. బం‍గ్లాదేశ్‌ గెలవలేదా? | Pressure is on India not Bangladesh: Ashraful | Sakshi
Sakshi News home page

శ్రీలంకనే గెలిచింది.. బం‍గ్లాదేశ్‌ గెలవలేదా?

Published Wed, Jun 14 2017 6:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

శ్రీలంకనే గెలిచింది.. బం‍గ్లాదేశ్‌ గెలవలేదా?

శ్రీలంకనే గెలిచింది.. బం‍గ్లాదేశ్‌ గెలవలేదా?

బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్ అష్రాఫుల్‌
 

లండన్‌: భారత పై శ్రీలంకనే విజయం సాధించినపుడు బంగ్లాదేశ్‌ అలవోకగా విజయం సాధిస్తుందని బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అష్రాఫుల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఇది బంగ్లాదేశ్‌కు కలిసొచ్చె అంశమని అష్రాఫుల్‌ అభిప్రాయపడ్డాడు. ఈ అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకోని ఫైనల్‌ పోరులో నిలుస్తామని అష్రాఫుల్‌ ధీమా వ్యక్తం చేశాడు. సెమీస్‌కు చేరిన మా జట్టు చాల సంతోషంగా ఉందన్నాడు. కానీ భారత్‌ పరిస్థితి అలా లేదని చాంపియన్స్‌గా నిలుస్తారని 130 కోట్ల జనాభా వారిపై ఆశలు పెట్టుకున్నారని అష్రాపుల్‌ పేర్కొన్నాడు. భారత్‌పై పవర్‌ ప్లేలో మూడు వికెట్లు తీస్తే గెలవడం సులవని అష్రాఫుల్‌ అభిప్రాయపడ్డాడు. ఇక న్యూజిలాండ్‌పై అనూహ్య విజయం సాధించిన బంగ్లాదేశ్‌, దురదృష్టంతో ఆస్ట్రేలియా  టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.

ఈ మధ్యకాలంలో మా ఆటతీరు మెరుగైందని, ఆసీయా కప్‌ ఫైనల్‌ కూడా వచ్చామని మరో మాజీ కెప్టెన్‌ హబీబుల్‌ బషీర్‌ గుర్తు చేశాడు. ఇది బంగ్లా క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టమని,  మినీ వరల్డ్‌ కప్‌ వంటి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని బషీర్‌ చెప్పుకొచ్చాడు. ఇక భారత్‌పై ఒత్తిడి ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. బషీర్‌ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్‌  2007 ప్రపంచకప్‌లో భారత్‌పై సంచలన విజయం నమోదుచేసింది. దీంతో భారత్‌ లీగ్‌ దశలోనే టోర్నినుంచి నిష్ర్కమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement