తలైవాస్‌ను గట్టెక్కించిన అజయ్‌ | Pro Kabaddi League 2017: Tamil Thalaiva win | Sakshi
Sakshi News home page

తలైవాస్‌ను గట్టెక్కించిన అజయ్‌

Published Thu, Sep 14 2017 12:36 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

తలైవాస్‌ను గట్టెక్కించిన అజయ్‌

తలైవాస్‌ను గట్టెక్కించిన అజయ్‌

ప్రొ కబడ్డీ లీగ్‌  

సోనెపట్‌: ఆట ముగిసేందుకు ఇక నిమిషమే మిగిలుంది. తమిళ్‌ తలైవాస్‌ 30–31 స్కోరుతో వెనుకబడింది. ఈ దశలో కూతకు వెళ్లిన అజయ్‌ ఠాకూర్‌ సూపర్‌ రైడ్‌తో ఆధిక్యం 33–31తో తారుమారైంది. ఇంకొన్ని క్షణాల వ్యవధిలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో చివరకు తమిళ్‌ తలైవాస్‌ 34–33తో యూపీ యోధపై గెలుపొందింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 12–18తో ఓటమి ఖాయమనుకున్న తలైవాస్‌ జట్టు రెండో అర్ధభాగంలో అసాధారణ స్థాయిలో చెలరేగింది. రైడర్లు, డిఫెండర్లు శ్రమించి జట్టును గెలిపించారు. అజయ్‌ ఠాకూర్, ప్రపంజన్‌ చెరో 8 పాయింట్లు సాధించగా, టాకిల్‌లో అమిత్‌ హుడా 4, వినీత్‌ కుమార్‌ 3 పాయింట్లు చేశారు.

యూపీ యోధ తరఫున రైడర్‌ నితిన్‌ తోమర్‌ అద్భుతంగా పోరాడాడు. 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన నితిన్‌ 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. రిషాంక్‌ దేవడిగా 8 పాయింట్లు చేయగా... డిఫెండర్‌ నితీశ్‌ కుమార్‌ (5) టాకిల్‌లో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 38–22 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. పుణేరి తరఫున దీపక్‌ హుడా 13, సందీప్‌ నర్వాల్‌ 8 పాయింట్లు చేయగా, రాజేశ్, మోను, రవి కుమార్, గిరీశ్‌ తలా 2 పాయింట్లు సాధించారు. హరియాణా జట్టులో దీపక్‌ కుమార్‌ దహియా (11) రాణించాడు. మిగిలిన వారిలో వజీర్‌ సింగ్‌ 3, సురేందర్‌ నడా, మోహిత్‌ చిల్లర్, జీవ గోపాల్‌ తలా 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement