
ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. జోన్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 35–44తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓటమి పాలైంది. తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ (9 రైడ్ పాయింట్లు) పోరాడినా... అతనికి సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మరో ఓటమి తప్పలేదు.
బెంగళూరు తరఫున పవన్ 16, కాశీలింగ్ 12 పాయింట్లతో చెలరేగారు. జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 42–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది.