'బల్బీర్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి' | Punjab CM recommends hockey legend Balbir for Bharat Ratna | Sakshi
Sakshi News home page

'బల్బీర్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి'

Sep 19 2014 7:24 PM | Updated on Sep 2 2017 1:39 PM

హాకీ దిగ్గజ ఆటగాడు, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత బల్బీర్ సింగ్(సీనియర్)కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వం సిఫారసు చేసింది.

చండీగఢ్: హాకీ దిగ్గజ ఆటగాడు, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత బల్బీర్ సింగ్(సీనియర్)కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ లేఖ రాశారు.

ప్రపంచకప్ ఫైనల్లో ఐదు గోల్స్ కొట్టిన రికార్డు బల్బీర్ సింగ్ పేరిట ఉందని లేఖలో పేర్కొన్నారు. గిన్నీస్ బుక్ లో నమోదైన ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదని గుర్తుచేశారు. బల్బీర్ సింగ్ సాధించిన విజయాలు ఎనలేనివని, ఆయనకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలని ప్రధానికి రాసిన లేఖలో బాదల్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement