అదరగొడుతున్న సింధు | PV Sindhu enters Hong Kong Open Super Series semifinals | Sakshi
Sakshi News home page

అదరగొడుతున్న సింధు

Published Fri, Nov 25 2016 1:42 PM | Last Updated on Sun, Sep 2 2018 3:19 PM

అదరగొడుతున్న సింధు - Sakshi

అదరగొడుతున్న సింధు

కౌలూన్: రియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు అదరగొడుతోంది. ఇటీవలే చైనా సూపర్‌ సిరీస్‌ గెలిచిన ఈ తెలుగమ్మాయి తాజాగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లోనూ దూసుకుపోతోంది. టైటిల్‌ కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సింగపూర్ క్రీడాకారిణి లియాంగ్ ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 21-17, 21-23, 21-18 స్కోరుతో లియాంగ్ పై విజయం సాధించింది.

మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌.. చైనా ప్లేయర్‌ యి చెంగ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సైనా గెలిస్తే సెమీఫైనల్లో సింధుతో తలపడాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement