సైనా, సింధు ముందంజ
సైనా, సింధు ముందంజ
Published Thu, Nov 24 2016 12:02 AM | Last Updated on Sun, Sep 2 2018 3:19 PM
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో సింధు అలవోక విజయం సాధించగా, సైనా మూడు గేమ్‌ల పాటు పోరాడాల్సి వచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ సైనా 12-21, 21-19, 21-17 స్కోరుతో ప్రపంచ 12వ ర్యాంక్ క్రీడాకారిణి పోర్న్‌టిప్ బురానాప్రసేర్‌సుక్ (థారుులాండ్)పై విజయం సాధించింది. చైనా ఓపెన్ తొలి రౌండ్‌లో పోర్న్‌టిప్ చేతిలోనే ఓడిన సైనా.. వారం వ్యవధిలోనే ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడం విశేషం.
గాయంనుంచి కోలుకున్న తర్వాత సైనాకు ఇదే తొలి విజయం. మరో వైపు సింధు 21-13, 21-16 తేడాతో సుశాంతో యూలియా (ఇండోనేసియా)ను చిత్తు చేసింది. పురుషుల విభాగంలో అజయ్ జయరామ్, సమీర్ వర్మ, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా ముందంజ వేశారు. జయరామ్ 21-15, 13-21, 21-16తో ఆంథోనీ సినిసుక (ఇండోనేసియా)పై, సమీర్ వర్మ 22-20, 21-18తో టకుమాపై, ప్రణయ్ 21-16, 21-18తో ఖియో బిన్ (చైనా)పై గెలుపొందారు. మరో వైపు సారుు ప్రణీత్ 18-21, 18-21తో మూడో సీడ్ జుర్గెన్సన్ (డెన్మార్క్) చేతిలో, డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 15-21, 8-21తో సొల్‌గ్యూ-సుంగ్ యున్ (కొరియా) చేతిలో ఓటమిపాలయ్యారు.
Advertisement
Advertisement