హాంకాంగ్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ... హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ సింధు కేవలం 36 నిమిషాల్లో 21–15, 21–16తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. అయితే భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. సైనా 13–21, 20–22తో కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓడింది. సైనా తాను ఆడిన గత ఆరు టో ర్నీల్లో ఐదుసార్లు తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది.
సాయిప్రణీత్ పరాజయం
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రపంచ పదో ర్యాంకర్ సాయిప్రణీత్ 21–11, 18–21, 12–21తో మూడో సీడ్ షి యుకి (చైనా) చేతిలో... సమీర్ వర్మ 11–21, 21–13, 8–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. పారుపల్లి కశ్యప్ 21–18, 16–21, 21–10తో కెంటా నిషిమోటో (జపాన్)పై, ప్రణయ్ 21–17, 21–17తో హువాంగ్ జియాంగ్ (చైనా)పై, సౌరభ్ వర్మ 21–11, 21–15తో బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. శ్రీకాంత్‌కు టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) నుంచి వాకోవర్ లభించింది.
సాత్విక్–చిరాగ్ జంట ఓటమి
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాతి్వక్ సాయి రాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–17, 16–21, 17–21తో టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) జంట చేతిలో.... మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 13–21, 12–21తో మైకెన్–సారా తిగెసన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యాయి.
సైనా ఇంటికి... సింధు ముందుకు
Published Thu, Nov 14 2019 1:45 AM | Last Updated on Fri, Nov 15 2019 8:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment