సింధు శుభారంభం | PV Sindhu, K Srikanth in pre-quarterfinals of Malaysia Masters | Sakshi
Sakshi News home page

సింధు శుభారంభం

Published Thu, Jan 21 2016 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

సింధు శుభారంభం

సింధు శుభారంభం

పెనాంగ్:మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-17, 21-16తో సబ్రినా జాక్వెట్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌లో శ్రీకాంత్ 21-16, 21-15తో క్రిస్టినా జొనాథన్ (ఇండోనేసియా)పై, జయరామ్ 21-17, 21-17తో పీటర్ కౌకుల్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు.

 ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 14-21, 21-10, 18-21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో; సమీర్ వర్మ 21-7, 13-21, 16-21తో గో సువాన్ హువాట్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-14, 14-21, 25-23తో మీ కువాన్ చౌ-లీ మెంగ్ యీన్ (మలేసియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement