పివి సింధు తొలిసారి.. | pv sindhu wins maiden syed modi grand prix title | Sakshi
Sakshi News home page

పివి సింధు తొలిసారి..

Published Sun, Jan 29 2017 6:44 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

పివి సింధు తొలిసారి..

పివి సింధు తొలిసారి..

లక్నో:సయ్యద్‌ మోడి గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు చాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పివి సింధు 21-13, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మరిస్కపై విజయం సాధించి టైటిల్ను సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సింధు అలవోకగా గెలుపొంది తొలిసారి ఈ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఏ దశలోనూ సింధును నిలువరించలేకపోయిన గ్రెగోరియా రన్నరప్ గా సరిపెట్టుకుంది.ఇది పివి సింధుకు తొలి సయ్యద్‌ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌  టైటిల్ కావడం విశేషం.

ఇక పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సమీర్ వర్మ 21-19,21-16 తేడాతో మన దేశానికే చెందిన సాయి ప్రణీత్ పై విజయం సాధించి టైటిల్ ను సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement