హరియాణా హ్యామర్స్ శుభారంభం | PWL: Haryana Hammers register comprehensive win over | Sakshi
Sakshi News home page

హరియాణా హ్యామర్స్ శుభారంభం

Published Sun, Dec 13 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

PWL: Haryana Hammers register comprehensive win over

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో హరియాణా హ్యామర్స్ జట్టు తొలి మ్యాచ్‌లోనే నెగ్గి శుభారంభం చేసింది. శనివారం ఢిల్లీ వీర్స్‌తో జరిగిన పోరులో 5-2తో నెగ్గింది. గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉన్న స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 65 కేజీ విభాగంలో నవ్రుజోవ్ ఇక్తియార్‌పై 3-2తో నెగ్గాడు. రెండో రౌండ్‌లో ఫిట్‌నెస్ పరంగా కాస్త ఇబ్బంది పడినా తుదకు విజేతగా నిలిచాడు. అంతకుముందు తొలి బౌట్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత లివాన్ లోపెజ్ (హరియాణా) 74 కేజీ విభాగంలో 7-0తో దినేశ్‌ను చిత్తు చేశాడు.
 
  ఢిల్లీ వీర్ తరఫున గుర్‌పాల్ సింగ్ (97 కేజీలు) 11-0తో యూరీ మెయిర్‌ను ఓడించి స్కోరును 1-1తో సమం చేశాడు. మహిళల 58 కేజీల్లో ప్రపంచ నంబర్‌వన్ ఒక్సానా హెర్హెల్ 6-1తో ఎలిఫ్ జాలేను ఓడించి హరియాణా కు ఆధిక్యం అందించింది. పురుషుల 125 కేజీల్లో హితేందర్ (హరియాణా) 7-4తో క్రిషన్ కుమార్‌పై గెలుపొందగా... మహిళల 69 కేజీల్లో గీతికా (హరియాణా) వరుసగా రెండు పాయింట్లు సాధించి 2-2తో నిక్కీని ఓడించింది. 48 కేజీల్లో వినేశ్ 10-0తో నిర్మలా దేవి (హరియాణా)పై గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement