
స్టీవ్ స్మిత్
సాక్షి, హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాదంతో తమ తప్పును అంగీకరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన సానుభూతిని వ్యక్తం చేశాడు. ‘ప్రపంచం మీ ఏడుపును కోరుకుంది. మీరు ఏడ్చారు కదా! ఇక వారంతా సంతృప్తి చెందారు. ప్రశాంతంగా జీవిస్తారు. ఈ ఘటన నుంచి బయటపడే శక్తిని ఆ దేవుడు మీకివ్వాలి (స్మిత్, బెన్ క్రాప్ట్, డెవిడ్ వార్నర్)’ అని ట్వీట్ చేశాడు.
ఇక మరో ట్వీట్‌లో ‘వార్నర్‌కు ఈ ఘటనను ఎదర్కునే శక్తి కావాలి. వారి దేశ ఆటగాళ్ల యూనియన్ నుంచి అతనికి మద్దతు లభిస్తోందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నాడు. ఇక ట్యాంపరింగ్ ఘటనపై తమ తప్పును అంగీకరిస్తూ కెప్టెన్ స్టీవ్ స్మిత్, బాన్ క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్‌లు పశ్చాతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మరో వైపు జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ కోచ్ పదవికి కూడా రాజీనామా చేసాడు.
కన్నీళ్లు పెట్టుకున్న ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు, అభిమానులు సైతం సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. శిక్షల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని అభిప్రాయ పడుతున్నారు.
The world simply wants to see you cry, once you have cried they will feel satisfied and live happily ever after. If only Empathy was not just a Word and people still had it. God give @stevesmith49 and Bancroft all the strength to come out of this.🙏
— Ashwin Ravichandran (@ashwinravi99) 30 March 2018
Comments
Please login to add a commentAdd a comment