పోర్ట్ ఎలిజబెత్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 101 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మర్‌క్రామ్ (21), హషీమ్ ఆమ్లా(27), ఏబీ డివిలియర్స్(28), డిబ్రన్(15 నాటౌట్)లు తలో చేయి వేసి జట్టు విజయంలో సహకరించారు. తాజా గెలుపుతో సఫారీలు సిరీస్‌ను 1-1తో సమం చేశారు.
అంతకుముందు 180/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 59 పరుగులకే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది.రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ పేసర్ ఏకంగా 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.తొలి ఇన్నింగ్స్‌ల్లోనే 5 వికెట్లతో అదరగొట్టిన రబడ.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా చెలరేగి బౌలింగ్ చేశాడు. ఫలితంగా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సార్లు 10 వికెట్లు పడగొట్టిన మూడో సఫారీ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక సఫారీ తొలి ఇన్నింగ్స్‌లో డివిలియర్స్(126 నాటౌట్) అజ్యే సెంచరీతో రాణించి తన జట్టును ఆధిక్యంలో నిలిపాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 243 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 239 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 382 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 102/4(22.5 ఓవర్లలో)
Comments
Please login to add a commentAdd a comment