భారత ‘ఎ’ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా రమేశ్‌ పొవార్‌  | Ramesh Powar Is An New Coach For Indian A Team | Sakshi
Sakshi News home page

భారత ‘ఎ’ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ 

Published Wed, Aug 28 2019 7:09 AM | Last Updated on Wed, Aug 28 2019 7:09 AM

Ramesh Powar Is An New  Coach For  Indian A Team - Sakshi

ముంబై: దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ను నియమించారు. తిరువనంతపురంలో గురువారం మొదలయ్యే ఈ సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు, ఐదు అనధికారిక వన్డేలు జరుగుతాయి. టీమిండియా తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్‌ పొవార్‌ భారత మహిళల జట్టుకు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు. అదే సమయంలో సీనియర్‌ సభ్యురాలు మిథాలీ రాజ్, పొవార్‌ మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదం తర్వాత మరోసారి అతను మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కపిల్‌ దేవ్‌ నాయకత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ రమేశ్‌ పొవార్‌ను కాదని డబ్ల్యూవీ రామన్‌ను మహిళల జట్టుకు కోచ్‌గా నియమించింది.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement