ఉత్కంఠపోరులో బెంగళూరు విజయం | RCB beats gujarat lions by 21 runs | Sakshi
Sakshi News home page

ఉత్కంఠపోరులో బెంగళూరు విజయం

Published Tue, Apr 18 2017 11:48 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

ఉత్కంఠపోరులో బెంగళూరు విజయం - Sakshi

ఉత్కంఠపోరులో బెంగళూరు విజయం

రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఇక్కడ గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 192 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. గేల్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. తద్వారా ఈ సీజన్ లో తొలి హాఫ్ సెంచరీని గేల్ సాధించాడు. మరొకవైపు కోహ్లి కూడా క్లాస్ టచ్ ఇచ్చాడు.

50 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 64 పరుగుల్ని కోహ్లి నమోదు చేశాడు. ఈ జోడి తొలి వికెట్ కు 122 పరుగుల్ని జోడించిన తరువాత గేల్ అవుటయ్యాడు.ఆ తరువాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి జోరును మరింత పెంచే క్రమంలో రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అయితే చివర్లో ట్రావిస్ హెడ్(30 నాటౌట్;16 బంతుల్లో 2 సిక్సర్లు,1 సిక్స్), కేదర్ జాదవ్(38 నాటౌట్; 15 బంతుల్లో 5 ఫోర్లు2 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగు వద్ద ఓపెనర్ డ్వేన్ స్మిత్ వికెట్ కోల్పోయింది. ఆపై దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ రైనా(23: 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ను చాహల్ ఔట్ చేశాడు. మూడో వికెట్ కు ఫించ్ (19)తో కలిసి మెకల్లమ్(72: 44 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) 66 పరుగులు జోడించాడు. దినేష్ కార్తిక్(1) విఫలమయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి జడేజా(23) రనౌటయ్యాడు. చివర్లో ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో నిర్ణీత ఓవర్లలో 192 పరుగులకే పరిమితమైంది. 21 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement