ఫీల్డింగ్ ఎంచుకున్నకోహ్లి సేన
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కోహ్లి తొలుత పుణెను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.ఇరుజట్లు ఇప్పటివరకూ నాలుగేసి మ్యాచ్లు ఆడగా కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచాయి. ఇక రన్ రేట్ పరంగా ఆర్సీబీ ఆరో స్థానంలో ఉండగా, పుణె చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి గాడిలో పడాలని ఆర్సీబీ-పుణెలు భావిస్తుండటంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.
పుణె తుది జట్టు; స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, మనోజ్ తివారీ,ఎంఎస్ ధోని, క్రిస్టియన్, చాహర్, ఇమ్రాన్ తాహీర్, శార్దూల్ ఠాకూర్,ఉనాద్కత్
ఆర్సీబీ తుది జట్టు:విరాట్ కోహ్లి(కెప్టెన్), మన్ దీప్ సింగ్, ఏబీ డివిలియర్స్, కేదర్ జాదవ్, షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగీ,మిల్నీ, ఎస్ అరవింద్,చాహల్, శామ్యూల్ బద్రీ