మళ్లీ చిత్తుగా ఓడారు..! | pune beats RCB by 61 runs | Sakshi
Sakshi News home page

మళ్లీ చిత్తుగా ఓడారు..!

Published Sat, Apr 29 2017 7:25 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

మళ్లీ చిత్తుగా ఓడారు..!

మళ్లీ చిత్తుగా ఓడారు..!

పుణె:ఈ సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అసలు పోరాటాన్ని పూర్తిగా మరిచిపోయినట్లు కనబడుతున్న ఆర్సీబీ మరో ఘోర ఓటమిని మూట గట్టుకుంది. రైజింగ్ పుణెతో జరిగిన తాజా మ్యాచ్ లో కోహ్లి సేన 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పుణె నిర్దేశించిన 158 పరుగుల సాధారణ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆర్సీబీ పూర్తిగా చేతులెత్తేసింది. పది మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారంటే ఆర్సీబీ పేలవ ప్రదర్శన ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.

 

ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మొదలైన పతనం ఏ దశలోనూ ఆగకపోవడంతో ఆర్సీబీకి ఘోర పరాజయం తప్పలేదు.  ఇది ఆర్సీబీకి ఏడో ఓటమి కావడంతో ఇక ఆ జట్టు నాకౌట్ ఆశలు దాదాపు గల్లంతే. ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లి(55; 48 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఏ ఒక్కరూ క్రీజ్లో నిలబడే యత్నమే చేయలేదు. ఆర్సీబీ ఆటగాళ్ల దారుణ ఆట తీరుకు అవతలి ఎండ్లో కోహ్లి చూస్తూ ఉండి పోవడం మినహా చేసేదేమీ లేకపోయింది. కనీసం పోరాడంలో విఫలం కావడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో పుణె బౌలర్లు సమష్టిగా రాణించి ఆర్సీబీకి చుక్కలు చూపించారు. పుణె బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ మూడు వికెట్లు సాధించగా, ఫెర్గ్యుసన్ కు రెండు,ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్లకు తలో వికెట్ దక్కింది.



అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(45;32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోగా,  రాహుల్ త్రిపాఠి(37;28 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్స్), మనోజ్ తివారీ(44 నాటౌట్; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాతయుతంగా ఆడారు.  ఇక చివర్లో మహేంద్ర సింగ్ ధోని(21 నాటౌట్; 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)  ఫర్వాలేదనిపించడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

పుణెకు ఆదిలోనే అజింక్యా రహానే(6) వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో త్రిపాఠికి జత కలిసిన స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. క్రీజ్ లోకి వచ్చీ రావడంతోనే స్మిత్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే స్టువర్ట్ బిన్నీ వేసిసన 14 ఓవర్ చివరి బంతికి స్మిత్ అవుట్ అయ్యాడు. దాంతో పుణె స్కోరులో వేగం తగ్గింది. ఆపై మనోజ్ తివారి-మహేంద్ర సింగ్ ధోనిలు మెల్లగా ఇన్నింగ్స్ ను నిర్మించారు. అయితే ఆఖరి ఓవర్లలో పుణె సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల్ని సాధించడంలో విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో  మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సమిష్టగా రాణించి పుణెను భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement