రియా ఆరోపణలు అవాస్తవం | Rea fallacy of allegedly | Sakshi
Sakshi News home page

రియా ఆరోపణలు అవాస్తవం

Published Tue, May 13 2014 1:00 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

రియా ఆరోపణలు అవాస్తవం - Sakshi

రియా ఆరోపణలు అవాస్తవం

లియాండర్ పేస్
న్యూఢిల్లీ: కుమార్తె సంరక్షణ బాధ్యతల విషయంలో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, అతడి సహచర భాగస్వామి రియా పిళ్లై మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా తనను ఇంట్లో బంధించి తాళం వేసినట్టు పేస్‌పై బాంద్రా పోలీసులకు రియా ఫిర్యాదు చేసింది. ముంబైలోని పేస్ ఇంట్లోనే రియా ఉంటోంది. అయితే ఈ ఆరోపణలను పేస్ కొట్టివేశాడు. ‘నా మీద రియా చేస్తున్న ఆరోపణ లన్నింటినీ ఖండిస్తున్నాను.

నా కూతురి సంరక్షణ పిటిషన్ కోసం నేను పేర్కొన్న ప్రతీ అంశంపై డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. కోర్టులో నాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని అనుకుంటున్నాను. నాకు నా కూతురు అయానానే ప్రపంచం. అవసరమైతే తన కోసం కెరీర్‌ను వదులుకుంటాను’ అని 40 ఏళ్ల పేస్ స్పష్టం చేశాడు. అయితే ఈ సీజన్‌లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో ఆడతానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement