రాజ్‌కోట్: బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అత్యుత్సాహం స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు తన తొలి ఓవర్లోనే వికెట్ తీసే భాగ్యాన్ని దూరం చేసింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మూడో బంతికి లిటన్ దాస్ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. అయితే స్టంపింగ్ కోసం బంతిని అందుకునే యత్నంలో పంత్ చేతులు వికెట్ల ముందుకు వచ్చేశాయి. ఐసీసీ 40.3 నిబంధన మేరకు దీనిని అంపైర్ నాటౌట్‌గా ప్రకటించి నోబాల్ ఇచ్చాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తు చేసింది. చహల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్ 10న నాగ్‌పూర్‌లో జరగనుంది. (చదవండి: పంత్.. నీ కీపింగ్ ఏంది?: తలపట్టుకున్న రోహిత్)
Comments
Please login to add a commentAdd a comment