న్యూఢిల్లీ: భారత్‌లో ‘రోడ్ టు వింబుల్డన్’ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. దీనికోసం ఇక్కడికొచ్చిన ఇంగ్లండ్ మాజీ టెన్నిస్ స్టార్ టిమ్ హెన్మన్ మాట్లాడుతూ టెన్నిస్ చాలెంజింగ్ గేమ్ అని అన్నారు.
ఇక్కడి ప్రతిభావంతులను గుర్తించి, వారికి టెన్నిస్ క్లీనిక్స్ నిర్వహించి జూనియర్ వింబుల్డన్‌కు అర్హత సాధించేలా చేయడమే ఈ టోర్నీ లక్ష్యం. విడతల వారీగా పలు నగరాల్లో ఈ క్లీనిక్‌లను నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో రాణించిన బాలబాలికలను ఇద్దరు చొప్పున ఎంపిక చేసి... ఈ నలుగురికి ఆగస్టులో యూకేలో జరిగే వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో పోటీ పడే అవకాశమిస్తారు.
‘రోడ్ టు వింబుల్డన్’ ప్రారంభం
Published Fri, Jan 10 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement