ఫెడరర్ అవుట్
సులువైన ‘డ్రా’ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. తన దేశానికే చెందిన ఎనిమిదో సీడ్ వావ్రింకా చేతిలో ఫెడరర్ 4-6, 3-6, 6-7 (4/7)తో ఓటమి పాలయ్యాడు. గతేడాది ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిన వావ్రింకా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లో ఫెడరర్‌ను ఓడించాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం మొదటిసారి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఓవరాల్‌గా ఫెడరర్ చేతిలో 16 సార్లు ఓడిన వావ్రింకాకిది అతనిపై మూడో విజయం కావడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 6-1, 6-4, 4-6, 3-6, 6-3తో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్)పై గెలిచి వావ్రింకాతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు.