తెలంగాణ కెప్టెన్‌గా రోహన్
అండర్-15 జట్టు ఎంపిక
హైదరాబాద్: తెలంగాణ అండర్-15 క్రికెట్ జట్టు సారథిగా వి. రోహన్ కుమార్ (హైదరాబాద్) ఎంపికయ్యాడు. ఇతని సారథ్యంలోని రాష్ట్ర జట్టు జాతీయ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో తలపడుతుంది. ఈటోర్నీ ఈ నెల 11 నుంచి న్యూఢిల్లీలో జరగనుంది.
జట్టు: రోహన్ (కెప్టెన్), శివకుమార్, ఎం.డి. ఆదిల్, మోజిమ్ (మహబూబ్‌నగర్), అశ్రీత్ గౌడ్ (రంగారెడ్డి), శ్రవణ్ కుమార్, హరీశ్ సింగ్ ఠాకూర్, వినోద్, వేణు నాయక్ (ఆదిలాబాద్), బాబ్జి, లక్ష్మణమూర్తి (కరీంనగర్), రహ్మత్ హుస్సేన్ (నిజామాబాద్), తరుణ్ (మెదక్), సంజయ్, జశ్వంత్ రెడ్డి, అంకుర్ సింగ్ (ఖమ్మం); స్టాండ్‌బైస్: సుశాంత్ రెడ్డి (హైదరాబాద్), జయరాం కశ్యప్ (ఖమ్మం), సేవియా (మహబూబ్‌నగర్), అమీర్ (ఆదిలాబాద్).
చాంప్ హైదరాబాద్
ఎస్‌ఎస్‌పీఎఫ్ అండర్-15 అంతర్ జిల్లా స్కూల్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు... మహబూబ్‌నగర్‌పై విజయం సాధించింది. సాయ్ నిర్వహించే ఈ టోర్నీని రాష్ట్రంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) నిర్వహించింది. బహుమతి ప్రదానోత్స కార్యక్రమానికి టీఆర్‌ఎస్ సీనియర్ నేత వి. ప్రకాశ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఇందులో క్యాట్ కార్యదర్శి సునీల్ బాబు, హెచ్‌సీఏ ఈసీ సభ్యుడు బాబురావు సాగర్ తదితరులు పాల్గొన్నారు.