
దుబాయ్: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానానికి ఎగబాకాడు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ టాప్–10 ర్యాంకుల్లో నిలిచిన మూడో భారత క్రికెటర్‌గా రోహిత్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ ఓపెనర్ వన్డేల్లో రెండో స్థానంలో, టి20ల్లో ఏడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కోహ్లికి గతం లో అన్ని ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచిన ఘనత ఉండగా... మాజీ ఓపెనర్ గంభీర్ టెస్టు, టి20ల్లో టాప్ ర్యాంకులో, వన్డేల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు రోహిత్ టెస్టు ర్యాంకు 44 కాగా... ఈ సిరీస్‌లో అతను అద్భుతంగా రాణించి 529 పరుగులు సాధించాడు. దీంతో అనూహ్యంగా టాప్–10లోకి దూసుకొచ్చాడు. టెస్టు బౌలర్ల జాబితాలో పేసర్లు షమీ 14వ, ఉమేశ్ యాదవ్ 24వ ర్యాంకుల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment