కోహ్లిని రావద్దని అరుస్తున్న రోహిత్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడ్డారు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక ఐదో వన్డేలో సెంచరీ సాధించినప్పటికి రోహిత్ నెటిజన్ల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. సమన్వయ లోపంతో కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్యా రహానేలను రనౌట్ చేయడంతో అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో తమ ఆవేశాన్ని సోషల్ మీడియాలో వెల్లగక్కారు.
మోర్కెల్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రోహిత్ సింగిల్ కోసం ముందుకు వచ్చే ప్రయత్నం చేసి ఆగిపోయాడు. అయితే మరోవైపు నుంచి కోహ్లి సగం పిచ్ దాటి దూసుకొచ్చేశాడు. వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే డుమిని డైరెక్ట్ త్రో నాన్ స్ట్రైకింగ్ వికెట్లకు తాకింది. మరి కొద్ది సేపటికే రహానే (8) కూడా దాదాపు ఇదే తరహాలో అవుటయ్యాడు.
ఈ రనౌట్లకు రోహితే కారణమని అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. ‘‘రెండు రనౌట్లకు కారణమైన నువ్వు యోయో టెస్ట్ ఎలా పాసయ్యావో తెలియడం లేదని’ ఒకరంటే.. ‘ఇంకా ఎన్ని రనౌట్లు కారణమైతావయ్యా’ అని మరొకరు.. ‘రోహిత్ స్వార్థపరమైన ఆట ఆడాడని’ ఇంకొకరు ట్రోల్ చేస్తున్నారు.
గత నాలుగు వన్డేల్లో దారుణంగా విఫలమైన రోహిత్ ఈ మ్యాచ్‌లో శతకం సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అభినందనలు తెలుపాల్సిన అభిమానులు రోహిత్ ఫిట్‌నెస్‌పై విమర్శలు గుప్పించడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. కీలక ఆటగాళ్లు రనౌట్లు కావడంతోనే భారత్ భారీ స్కోర్ సాధించలేకపోయిందని, ఇదే అభిమానులకు ఆగ్రహం తెప్పించిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
I wonder How Rohit Sharma Clears #Yo-Yo test for fitness.. 2 Run-outs..
— Ashish Akhade (@ARAashish) 13 February 2018
So selfish man @ImRo45 it was easy single @ajinkyarahane88 was 3 quarterly there
— yashtrikha (@yashtrikha) 13 February 2018
Comments
Please login to add a commentAdd a comment