![Root Double Hundred Gives England Marginal Stronghold - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/2/Root1.jpg.webp?itok=aUvuxfmz)
హామిల్టన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భాగంగా నిన్నటి ఆటలో సెంచరీతో ఆకట్టుకున్న రూట్.. సోమవారం నాల్గో రోజు ఆటలో దాన్ని డబుల్ సెంచరీగా మలచుకున్నాడు. 441 బంతుల్ని ఎదుర్కొన్న రూట్ 22 ఫోర్లు, 1 సిక్సర్‌తో 226 పరుగులు సాధించాడు. ఎప్పట్నుంచో ఫామ్ కోసం తంటాలు పడుతున్న రూట్ ఎట్టకేలకు డబుల్ సెంచరీతో సమాధానం చెప్పాడు.ఇది రూట్‌కు తన టెస్టు కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ.
269/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 207 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. ఓలీ పాప్(75) హాఫ్ సెంచరీతో మెరవడంతో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లండ్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. టామ్ లాథమ్(18), జీత్ రావల్(0)లు పెవిలియన్ చేరారు. కేన్ విలియమ్సన్( 37 బ్యాటింగ్), రాస్ టేలర్(31 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment