జోరూట్ అరుదైన ఘనత
లండన్: దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టు ద్వారా ఇంగ్లండ్ కెప్టెన్ గా బరిలోకి దిగి అదరగొట్టిన జో రూట్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో జో రూట్(190;234 బంతుల్లో 27 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకం సాధించాడు. తద్వారా కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన నాల్గో ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
అంతకుముందు గ్రాహమ్ డావ్లింగ్(239), చందర్ పాల్(203), క్లెమ్ హిల్(191)లు మాత్రమే తమ తొలి కెప్టెన్సీ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఉండగా, ఆపై జో రూట్ స్థానం సంపాదించాడు. అలెస్టర్ కుక్ వారసుడిగా ఇంగ్లండ్ టెస్టు పగ్గాలు చేపట్టిన జో రూట్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 184 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ను కొనసాగించిన జో రూట్.. మరో ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు.