ఇక గెలిచిన జట్టే నిలుస్తుంది!
రాయ్ పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ తొలుత ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించనున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికి మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాయి. ఇక నాల్గో బెర్తు రేసులో ఆర్సీబీ-ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడుతున్నాయి. ఇప్పటివరకూ ఇరుజట్లు ఏడేసి మ్యాచ్ ల్లో గెలిచి 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఎటువంటి సమీకరణాలూ లేకుండా ప్లే ఆఫ్ కు చేరుతుంది.
ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), డీకాక్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్,సంజూ శాంసన్, బిల్లింగ్స్, కార్లోస్ బ్రాత్ వైట్, క్రిస్ మోరిస్, నేగీ,అమిత్ మిశ్రా, జయంత్ యాదవ్,
బెంగళూరు తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, సచిన్ బేబీ, స్టువర్ట్ బిన్నీ,జోర్డాన్, ఇక్బాల్ అబ్దుల్లా,ఎస్ అరవింద్, చాహాల్, కేఎల్ రాహుల్