చండీగఢ్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని ‘డబుల్’పై గురి పెట్టింది. ఈ ఖమ్మం జిల్లా క్రీడాకారిణి అండర్-19తోపాటు అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలోనూ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన అండర్-19 సెమీఫైనల్లో రుత్విక 21-12, 21-13తో రసికా రాజె (మహారాష్ట్ర)పై... అండర్-17 సెమీఫైనల్లో 21-7, 21-13తో మృణ్మయి సవోజి (మహారాష్ట్ర)పై విజయం సాధించింది.
గురువారం జరిగే అండర్-19 ఫైనల్స్‌లో టాప్ సీడ్ కరిష్మా వాద్కర్ (మహారాష్ట్ర)తో; అండర్-17 ఫైనల్స్‌లో టాప్ సీడ్ రీతూపర్ణ దాస్ (ఆంధ్రప్రదేశ్) రుత్విక తలపడుతుంది. అండర్-17 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లో... ఎం.కనిష్క్ సెమీఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్స్‌లో 21-9, 21-17తో సిరిల్ వర్మపై నెగ్గిన డానియల్ ఫరీద్ (కర్ణాటక)... సెమీస్‌లో 21-19, 18-21, 21-18తో కనిష్క్‌ను ఓడించాడు.
టైటిల్ పోరుకు రుత్విక శివాని
Published Wed, Dec 4 2013 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement