chadigarh
-
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్‌ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్‌కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్ -
ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...
చండీగఢ్ : ప్రియుడితో పారిపోయేందుకు ఓ మహిళ భర్తను కిరాతకంగా హతమార్చిన ఘటన పంజాబ్‌లో వెలుగుచూసింది. తరన్‌తరన్ జిల్లాలో ఆదివారం రాత్రి నిందితురాలు తన భర్తకు విషం కలిపిన ఆహారం ఇచ్చిన అనంతరం అతను మరణించలేదనే భయంతో మెడకు తాడు బిగించి ఊపిరిఆడకుండా చేసి ప్రాణాలు తీసింది. భర్త మరణించిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తండ్రి ఇంటివద్ద విడిచిపెట్టి ప్రియుడితో పారిపోయింది. కాగా మహిళ పిల్లలు జరిగిన ఘటనను తాతకు వివరించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. తమ తల్లి సిమ్రాన్ తండ్రి రాజ్‌ప్రీత్‌ను మెడకు తాడును బిగించి చంపిందని పిల్లలు జరిగిన ఘోరాన్ని కళ్లకు కట్టారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన తమ తల్లిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు పోలీసులను కోరారు. నిందితురాలు సిమ్రాన్, ఆమె ప్రియుడు లవ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నారు. -
దట్టమైన పొగమంచు.. ఏడుగురు దుర్మరణం
చంఢీగడ్: రహదారిని కమ్మెసిన దట్టమైన పొగమంచు ఏడుగురిని బలితీసుకుంది. అంబలా, చంఢీగడ్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు జాతీయ రహదారిని కమ్మివేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని మరో వాహనంపైకి దూసుకుపోయ్యాయి. మృతులంతా చంఢీగడ్‌కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా పొగమంచు కారణంగా సోమవారం ఛండీగడ్లోనే జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఉత్తర భారతాన్ని పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంచు కారణంగా ఎదురుగావచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చేసుకుంటున్నాయి. -
హర్యానా గవర్నర్‌కు త్రుటిలో తప్పిన ముప్పు
విమానం టేకాఫ్ అవుతుండగా పొగలు చండీగఢ్: హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియాకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో అత్యవసరంగా దించేశారు. దీంతో గవర్నర్‌తో పాటు పది మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది కాక గవర్నర్ పహాడియా, ఆయన భార్య శాంతి, ఇద్దరు ఏడీసీలు, ఓ డాక్టర్, ఓ సహాయకుడుతో పాటు ఎనిమిది మంది ఉన్నారు. గురువారం ఉదయం 11.37 గంటలకు గవర్నర్ పహాడియా ఛండీగఢ్ నుంచి ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వ విమానంలో బయలుదేరారు. విమానం 30 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్‌వే సమీపంలో అత్యవసరంగా దించేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వైమానికదళ అధికారులు గవర్నర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పైలట్ వింగ్ కమాండర్ బీ నందా వెల్లడించారు. -
అండర్-19 విజేత సిరిల్ వర్మ
చండీగఢ్: కృష్ణ ఖేతాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్-19 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిరిల్ వర్మ విజేతగా నిలిచాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 21-10, 21-13 స్కోరుతో అరింతప్ దాస్ గుప్తాపై ఘన విజయం సాధించాడు. బాలికల అండర్-19 విభాగంలో ఏపీ అమ్మాయి డి. పూజకు చుక్కెదురైంది. ఫైనల్లో టాప్ సీడ్ రేవతి దేవస్థలే 21-16, 21-15తో పూజను ఓడించింది. అండర్-17 విభాగంలో రాష్ట్ర షట్లర్లు రెండు కేటగిరీల్లోనూ విజేతలుగా నిలిచారు. హోరాహోరీగా సాగిన బాలుర విభాగం ఫైనల్లో రాహుల్ యాదవ్ 18-21, 21-8, 21-16 తేడాతో ఏపీకే చెందిన రెండో సీడ్ ఎం. కనిష్క్పై గెలుపొంది టైటిల్ నెగ్గాడు. బాలికల ఫైనల్లో ఐదో సీడ్ వృషాలి 16-21, 21-14, 21-17 స్కోరుతో నాలుగో సీడ్ మహిమా అగర్వాల్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్ ఫలితాలు... అండర్-17 బాలుర డబుల్స్‌లో జి.కృష్ణ ప్రసాద్-సాత్విక్...బాలికల డబుల్స్‌లో కె.వైష్ణవి-సోనికా సాయి విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలుర డబుల్స్‌లో విఘ్నేశ్ -గంగాధర రావు...బాలికల డబుల్స్‌లో పూజ-నింగ్షీ బ్లోక్ టైటిల్ నెగ్గారు. అండర్-19 మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-డి. పూజ జోడి విజేతగా నిలిచింది. -
సింగిల్స్ చాంప్ రుత్విక
చండీగఢ్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు సత్తా చాటుకున్నారు. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని... అండర్-19 సింగిల్స్‌లో రీతూపర్ణ దాస్ విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలికల డబుల్స్‌లో తెలుగు అమ్మాయి మేఘన సహచరిణి రీతూపర్ణ దాస్‌తో కలిసి... అండర్-19 మిక్స్డ్ డబుల్స్‌లో ఎయిరిండియా ఆటగాడు సాన్యామ్ శుక్లాతో జతగా టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అండర్-17 ఫైనల్లో రెండో సీడ్ రుత్విక 21-19, 21-14తో కరిష్మా వాద్కర్ (మహారాష్ట్ర)ను ఓడించింది. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రుత్వికకు ‘డబుల్’ సాధించే అవకాశం చేజారింది. అండర్-19 సింగిల్స్ ఫైనల్లో రుత్విక 14-21, 7-21తో టాప్ సీడ్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రీతూపర్ణ దాస్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. బెంగాల్‌కు చెందిన రీతూపర్ణ దాస్ హైదరాబాద్‌లోని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. అండర్-19 బాలికల డబుల్స్ ఫైనల్లో మేఘన-రీతూపర్ణ దాస్ ద్వయం 17-21, 21-9, 21-12తో వైష్ణవి అయ్యర్ (మహారాష్ట్ర)-రేష్మా కార్తీక్ (ఎయిరిండియా) జోడిపై గెలిచింది. అండర్-19 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మేఘన-సాన్యామ్ శుక్లా జంట 21-11, 22-24, 21-7తో సంకీర్త్-మీరా మహాదేవన్ (కర్ణాటక) జోడిని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. -
టైటిల్ పోరుకు రుత్విక శివాని
చండీగఢ్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని ‘డబుల్’పై గురి పెట్టింది. ఈ ఖమ్మం జిల్లా క్రీడాకారిణి అండర్-19తోపాటు అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలోనూ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన అండర్-19 సెమీఫైనల్లో రుత్విక 21-12, 21-13తో రసికా రాజె (మహారాష్ట్ర)పై... అండర్-17 సెమీఫైనల్లో 21-7, 21-13తో మృణ్మయి సవోజి (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. గురువారం జరిగే అండర్-19 ఫైనల్స్‌లో టాప్ సీడ్ కరిష్మా వాద్కర్ (మహారాష్ట్ర)తో; అండర్-17 ఫైనల్స్‌లో టాప్ సీడ్ రీతూపర్ణ దాస్ (ఆంధ్రప్రదేశ్) రుత్విక తలపడుతుంది. అండర్-17 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లో... ఎం.కనిష్క్ సెమీఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్స్‌లో 21-9, 21-17తో సిరిల్ వర్మపై నెగ్గిన డానియల్ ఫరీద్ (కర్ణాటక)... సెమీస్‌లో 21-19, 18-21, 21-18తో కనిష్క్‌ను ఓడించాడు. -
ఫైనల్లో ఏపీ అమ్మాయిలు
చండీగఢ్: ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. షఫీ ఖురేషీ కప్ కోసం జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో శుక్రవారం ఏపీ 2-0 తేడాతో చండీగఢ్‌ను చిత్తు చేసింది. మొదటి సింగిల్స్‌లో రాష్ట్రానికి చెందిన రుత్విక శివాని 21-11, 21-10 స్కోరుతో ముస్కాన్ సోహిపై విజయం సాధించింది. డబుల్స్ మ్యాచ్‌లో రితుపర్ణ దాస్-మేఘన జోడి 21-10, 21-15 తేడాతో ముస్కాన్ సోహి-కైలాష్‌పై గెలుపొందింది. మరో సెమీ ఫైనల్లో ఎయిరిండియా 2-0తో కర్ణాటకను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల విభాగం (నారంగ్ కప్)లో ఎయిరిండి యా 2-0తో మహారాష్ట్రపై, కేరళ 2-0తో చండీగఢ్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాయి. -
పంజాబ్‌లో మిల్కా విగ్రహం
చండీగఢ్: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ విగ్రహం లూథియానాలో రూపుదిద్దుకుంటోంది. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందని ఫ్లయింగ్ సిఖ్ మిల్కా చెప్పారు. లూథియానాకు సమీప గ్రామమైన జార్ఖర్లో 28 అడుగుల ఎత్తై విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఒక స్పోర్ట్స్ అకాడమీ రూ. 7.5లక్షల వ్యయంతో ఈ ప్రతిమను నెలకొల్పుతోంది. డిసెంబర్ నెలాఖరుకల్లా దీని నిర్మాణం పూర్తవుతుందని ఆ అకాడమీ తెలిపింది. ‘గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడలకు ప్రాచుర్యం కల్పించేందుకు, బాలలు, యువత క్రీడల్లో రాణించేందుకు ఇది ప్రేరణగా నిలువనుంది’ అని మిల్కాసింగ్ అన్నారు.