ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన | sachin responed six years old girl letter | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

Published Fri, Sep 8 2017 4:09 PM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన - Sakshi

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

ముంబై:క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  సినిమా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'. గత మే నెలలో రిలీజ్ అయిన 'సచిన్' మూవీకి మంచి ఆదరణే లభించింది. అటు పెద్దల్ని నుంచి ఇటు చిన్నల వరకూ సచిన్ మూవీ బాగానే అలరించింది. ఈ క్రమంలోనే ఆ సినిమా చూసిన ఆరేళ్ల పాప తార సచిన్ కు లేఖ రాసి వార్తల్లో నిలిచింది.

సచిన్ అంకుల్ అంటూ లేఖను మొదలుపెట్టిన తార.. సినిమా గురించి పలు విషయాల్ని సచిన్ తో షేర్ చేసుకుంది. మీరు చివరి మ్యాచ్ ఆడేటప్పుడు తనకు ఏడుపు వచ్చేసిందంటూ లేఖలో వివరించింది. మిమ్మల్ని, అంజలీ ఆంటీని కలవాలని ఉందంటూ ముగించింది. దీనికి సచిన్ స్పందించాడు. ఈ లేఖ రాసినందుకు నీకు కృతజ్ఞతలు.నా సినిమా చూసి ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ముందుకు సాగు'అని సచిన్ బదులిచ్చారు. దీనిలో భాగంగా ఆ పాప రాసిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సచిన్.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement