పుణే: అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పనున్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.... నిజంగా మాస్టరేనని బ్రిటన్ యువరాజ్ ప్రిన్స్ చార్లెస్ కితాబిచ్చారు. అతను సంతోషంగా రిటైర్మెంట్ ప్రకటించాలని అభినందనలు తెలిపారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చార్లెస్ ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పైవిధంగా వ్యాఖ్యానించారు.