ఓడినా.. ప్రశంసలు ముంచెత్తాయి..
హైదరాబాద్: మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడినా మిథాలీ సేన పై ప్రశంసల జల్లు కురిస్తోంది. టోర్నీకి ముందు క్వాలిఫైయర్ మ్యాచ్‌ల నుంచి ఫైనల్ చేరిన భారత మహిళల పోరాట పటిమకు సగటు భారత అభిమాని ముగ్ధుడయ్యాడు. మాజీ క్రికెటర్ల నుంచి ప్రస్థుత క్రికెటర్లు.. ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు మిథాలీ సేన పోరాట పటిమ గర్వించేలా ఉందని పొగడ్తలతో ముంచెత్తారు. ఏప్పుడూ మ్యాచ్ ఓడిపోయినా.. ఆగ్రహానికి గురయ్యే భారత అభిమానులు.. ఫస్ట్ టైం సోషల్ మీడియాలో భారత మహిళలకు అండగా నిలుస్తూ క్రీడా స్పూర్తిని చాటుతున్నారు. వారి ప్రదర్శనను ప్రశంసిస్తున్నారు.
♦ దిగ్గజాల ప్రశంసల ట్వీట్లు..
మహిళా క్రికెటర్లు సాయశక్తుల పోరాడారు. టోర్నీ ఆసాంతం వారు గొప్ప పట్టుదలను నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ జట్టును చూసి గర్విస్తున్నా- ప్రధాని నరేంద్రమోదీ
Our women cricketers gave their best today. They have shown remarkable tenacity & skill through the World Cup. Proud of the team! @BCCIWomen
— Narendra Modi (@narendramodi) 23 July 2017
భారత మహిళలు మా మనసులను గెలిచారు.. ఉమెన్ ఇన్ బ్లూ ప్రదర్శన అద్భుతం కానీ ఒక్కోసారి ఇలాంటివి తప్పవు - సచిన్ టెండూల్కర్
Feel for all of you, #WomenInBlue! You were good throughout but sometimes it is not meant to be. Congrats England on winning #WWC17Final!
— sachin tendulkar (@sachin_rt) 23 July 2017
భారత మహిళలను చూసి గర్విస్తున్నా.. ఈ రోజు కలిసిరాలేదు. . ఐతే భారత్లో మహిళలకు ఆదరణ పెరిగిందనడంలో సందేహం లేదు. అమ్మాయిలు మీ పోరాట స్పూర్తికి వందనాలు.. -వీరేంద్ర సెహ్వాగ్
Super proud of the girls. Tough luck today but womens cricket in India has truly arrived. Thank you girls .Salute your spirit.#WWC17Final
— Virender Sehwag (@virendersehwag) 23 July 2017
మీరు మాకు నమ్మకాన్ని కలిగించారు. కలలు కనేలా చేశారు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. మీ ఆటను చూడటాన్ని గౌరవంగా భావిస్తున్నా.. -గౌతమ్ గంభీర్
You made us dream,
— Gautam Gambhir (@GautamGambhir) 23 July 2017
You made us believe,
We're proud of all you girls!
Real honor to hve watched u play! #WWC17Final #WomenInBlue @BCCIWomen
టోర్నీ ఆసాంతం గొప్ప ప్రదర్శన కనబర్చారు. ఓడినా మిలియన్ అభిమానుల మనసులను గెలిచారు. మీ ప్రదర్శన క్రీడా స్పూర్తిని కలిగించింది.- రోహిత్ శర్మ
Great effort throughout the tournament by team India. Lost the game but won million hearts by displaying some inspiring cricket. @BCCIWomen
— Rohit Sharma (@ImRo45) 23 July 2017
మీరు ఓడేంతవరకు గెలుస్తారనే నమ్మకాన్ని కలిగించారు. మహిళలు అద్భుతంగా ఆడారు. భారతీయ నారీ జిందాబాద్- అమితాబ్ బచ్చన్
T 2494 - Until you loose, you shall never know the joy of victory ! Well played ladies .. Bhartiya Nari Zindabad !! WWC17 pic.twitter.com/Ghxkou5Nn4
— Amitabh Bachchan (@SrBachchan) 23 July 2017
దేశం మొత్తం గర్వించే ప్రదర్శన కనబర్చారు. మీరు గొప్ప మైలు రాయి సాధించారు. - షారుక్ ఖాన్
I wish I was there to give the Lovely Ladies a hug. Be proud girls we have achieved greatness today. @BCCIWomen u made all Indians proud.
— Shah Rukh Khan (@iamsrk) 23 July 2017