పాక్ స్పిన్నర్ బౌలింగ్పై అనుమానాలు | Saeed Ajmal reported for suspected illegal bowling action | Sakshi
Sakshi News home page

పాక్ స్పిన్నర్ బౌలింగ్పై అనుమానాలు

Published Mon, Aug 11 2014 3:26 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

పాక్ స్పిన్నర్ బౌలింగ్పై అనుమానాలు - Sakshi

పాక్ స్పిన్నర్ బౌలింగ్పై అనుమానాలు

దుబాయ్: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. శ్రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో అజ్మల్ ఈ చర్యకు పాల్పడినట్టు ఆరోపించారు.

21 రోజుల్లోపు అజ్మల్ బౌలింగ్ను పరీక్షించనున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా పాక్ స్పిన్నర్ వేసిన చాలా బంతుల్ని సందేహాస్పదంగా పరిగణిస్తున్నట్టు మ్యాచ్ అధికారులు ఫిర్యాదు చేశారు. అజ్మల్ బౌలింగ్ యాక్షన్ను పరిశీలించాల్సిన అవసరముందని పాక్ జట్టు మేనేజర్ మొయిన్ ఖాన్కు స్పష్టం చేశారు. కాగా నివేదిక వచ్చేంతవరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు అజ్మల్ను అనుమతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement