illegal bowling action
-
మిస్టీరియస్ స్పిన్నర్ పై మళ్లీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వెస్టిండీస్ మిస్టీరియస్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ పై మరోసారి ఫిర్యాదు అందింది. అతడు బౌలింగ్ చేసే తీరు సందేహాస్పదంగా ఉందంటూ ఆన్-ఫీల్డ్ అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్టణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ యాక్షన్ నియమ నిబంధలనకు విరుద్ధంగా ఉందని ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్టన్, వినీత్ కులర్ణి రిపోర్ట్ చేశారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మరోసారి అతడు పరీక్ష ఎదుర్కొబోతున్నాడు. సందేహాస్పద బౌలింగ్ ఆరోపణలతో ఐపీఎల్-8 ప్రారంభానికి ముందు చెన్నై బయోమెకానికల్ సెంటర్ లో నరైన్ బౌలింగ్ పరీక్ష ఎదుర్కొన్నాడు. దీని ఫలితం వెలువడిన తర్వాతే ఐపీఎల్-8లో ఆడేందుకు బీసీసీఐ అతడికి అనుమతి ఇచ్చింది. మరోసారి నరైన్ బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ కు కంగారు పట్టుకుంది. -
పాకిస్థాన్ క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ
దుబాయ్: వన్డే ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్ క్రికెట్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని బయో మెట్రిక్ పరీక్షలో తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్రకటించింది. హఫీజ్ బౌలింగ్ శైలిని గత నెలలో పరీక్షించారు. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం శనివారం పాకిస్థాన్ ప్రాబబుల్స్‌కు హఫీజ్‌ను ఎంపిక చేశారు. మరుసటి రోజే అతనిపై వేటు పడటం పాక్ క్రికెట్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే. ఇదే కారణంతో మరో పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను ఐసీసీ సస్పెండ్ చేసింది. ప్రపంచ కప్ ముందు ఇద్దరు కీలక బౌలర్లపై వేటుపడటం పాక్ క్రికెట్‌ను కలవరపెడుతోంది. -
రేపు అజ్మల్ బౌలింగ్ కు పరీక్ష
దుబాయ్ : పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ ను సోమవారం పరీక్షించనున్నారు. అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడంటూ ఫిర్యాదు అందడంతో అతని బౌలింగ్ యాక్షన్ ను ఐసీసీ రేపు పరిశీలించనుంది.శ్ రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో అజ్మల్ బౌలింగ్ యాక్షన్ పై ఆరోపణలు వచ్చాయి. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా పాక్ స్పిన్నర్ వేసిన చాలా బంతుల్నిసందేహాస్పదంగా పరిగణిస్తున్నట్టు మ్యాచ్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆనాటి మ్యాచ్ లో అతను వేసే దూస్రా బంతుల్నిఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. 2009 లో అజ్మల్ బౌలింగ్ శైలిపై సందేహాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
పాక్ స్పిన్నర్ బౌలింగ్‌పై అనుమానాలు
దుబాయ్: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. శ్రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో అజ్మల్ ఈ చర్యకు పాల్పడినట్టు ఆరోపించారు. 21 రోజుల్లోపు అజ్మల్ బౌలింగ్‌ను పరీక్షించనున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా పాక్ స్పిన్నర్ వేసిన చాలా బంతుల్ని సందేహాస్పదంగా పరిగణిస్తున్నట్టు మ్యాచ్ అధికారులు ఫిర్యాదు చేశారు. అజ్మల్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించాల్సిన అవసరముందని పాక్ జట్టు మేనేజర్ మొయిన్ ఖాన్‌కు స్పష్టం చేశారు. కాగా నివేదిక వచ్చేంతవరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు అజ్మల్‌ను అనుమతించారు. -
శ్రీలంక స్పిన్నర్ సేననాయకేపై నిషేధం
కొలంబో: శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్రా సేననాయకేపై అంతర్జాతీయ క్రికెట్ మండలి వేటు వేసింది. గత మేలో ఇంగ్లండ్ పర్యటనలో సేననాయకే నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినందుకు ఐసీసీ అతనిపై నిషేధం విధించింది. సేననాయకేపై నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఇంగ్లండ్‌లోని కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్కూల్ లంక స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి నివేదికను ఐసీసీకి సమర్పించింది. సేననాయకే నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినట్టు తేలడంతో వేటు వేశారు.