
సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ
‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–18 జాతీయ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య జోడీ నిలకడగా రాణిస్తోంది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో భక్తి పర్వాని (గుజరాత్)తో జత కట్టిన సాయిదేదీప్య డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–భక్తి పర్వాని జంట 2–6, 7–6, 12–10తో షేక్ హుమేరా (తెలంగాణ)–ఈశ్వరీ సేత్ (గుజరాత్) జోడీపై గెలుపొందింది.