సెమీస్‌లో సానియా జోడి | sania mirza team entered in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడి

Published Thu, Jul 9 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

sania mirza team entered in semi finals

లండన్: వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్) - మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సానియా జోడి 7-5, 6-3తో డెలక్వా (ఆస్ట్రేలియా), స్వెడోవా (కజకిస్తాన్)పై అలవోకగా నెగ్గింది. గంటా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు సెట్లలోనూ సానియా-హింగిస్ ద్వయం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
 
 ‘మిక్స్‌డ్’లో క్వార్టర్స్‌కు...
 మరోవైపు సానియా మీర్జా (భారత్)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) ద్వయం మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో సానియా-సోరెస్ 6-3, 6-7 (5/7), 6-3తో మారిన్ ద్రగాంజా-అనా కోంజు (క్రొయేషియా)లపై గెలిచారు. జూనియర్ బాలికల సింగిల్స్ రెండో రౌండ్‌లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల 2-6, 3-6తో మిచెలా గోర్డాన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.
 
 నేటి మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్
 రద్వాన్‌స్కా ఁ ముగురుజా
 సెరెనా x షరపోవా
 సా.గం. 5.30 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement