'బెట్టింగ్స్, కుంభకోణాలు ఆటలో భాగమే'
'బెట్టింగ్స్, కుంభకోణాలు ఆటలో భాగమే'
Published Wed, Feb 12 2014 1:20 PM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
బెంగళూరు: ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై సమర్పించిన జస్టిస్ ముద్గల్ కమిటీ నివేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధినేత విజయ్ మాల్యా స్పందించారు. ప్రతి క్రీడలోనూ కుంభకోణాలు ఓ భాగంగా మారాయి అని మాల్యా వ్యాఖ్యానించారు. అయితే సంపన్న క్రికెట్ క్రీడగా మారిన ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ ను కుంభకోణాలు ఏమి చేయలేవని ఆయన అన్నారు.
ప్రతి క్రీడలో బెట్టింగ్, ఫిక్సింగ్ లు సర్వసాధారణమయ్యాయి అని మాల్యా తెలిపారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఐపీఎల్ కు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతునే ఉంది అని ఆయన అన్నారు. కాని అలాంటి కుంభకోణాలు ఐపీఎల్ లో చోటు చేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు.
బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ మేయప్పన్ ఐపీఎల్ లో బెట్టింగ్ పాల్పడ్డారని, ఆరు భారత క్రికెటర్లకు కూడా బెట్టింగ్ లో హస్తం ఉందని జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-7 టోర్ని కొసం జరుగుతున్న వేలం సందర్భంగా విజయ్ మాల్యా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement