16 ఏళ్ల తర్వాత... | Serena Williams suffers worst loss since she was 16 years old | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల తర్వాత...

Published Thu, Oct 23 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

16 ఏళ్ల తర్వాత...

16 ఏళ్ల తర్వాత...

సెరెనాకు దారుణ ఓటమి
 
సింగపూర్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌కు దారుణ ఓటమి ఎదురైంది. సిమోనా హలెప్ (రుమేనియా)తో బుధవారం జరిగిన ‘రెడ్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో సెరెనా 0-6, 2-6తో ఓడిపోయింది. తాను ఓడిపోయిన మ్యాచ్‌లో సెరెనా కేవలం రెండు గేమ్‌లు మాత్రమే గెలవడం 16 ఏళ్ల తర్వాత ఇప్పుడే. చివరిసారి సెరెనాకు ఈ తరహా ఓటమి 1998లో ఎదురైంది. ఒక్లాహామా సిటీ టోర్నమెంట్‌లో సెరెనా 1-6, 1-6తో జోనెట్ క్రుగెర్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement