
దుబాయ్:వెస్టిండీస్‌తో మూడు టీ 20ల సిరీస్‌ను 2-0తో గెలిచిన న్యూజిలాండ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కివీస్ 126 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని ఆక‍్రమించింది. బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ 20లో న్యూజిలాండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్ ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకుని అగ్రస్థానాన్ని తిరిగి చేజిక్కింకుంది.
గతేడాది నవంబర్‌లో భారత్ తో జరిగిన టీ 20 సిరీస్‌ను కివీస్ కోల్పోవడంతో పాకిస్తాన్ టాప్‌కు చేరింది. దాదాపు రెండు నెలల్లోనే మళ్లీ న్యూజిలాండ్ ప్రథమ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్(124) రెండో స్థానానికి పరిమితం కాగా, భారత్ జట్టు(121) మూడో స్థానంలో నిలిచింది. ఇక‍్కడ వెస్టిండీస్ ఐదు పాయింట్లను కోల్పోయి ఐదో స్థానంలో ఉంది. మరొకవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు వరుసగా ఆరు, ఏడు,ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. టీ 20 ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ తొమ్మిదో స్థానంలో, బంగ్లాదేశ్ పదో స్థానంలో ఉన్నాయి.
ఇదిలా ఉంచితే, న్యూజిలాండ్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవాలంటే త్వరలో పాకిస్తాన్‌తో జరిగే టీ 20సిరీస్‌ను గెలవాల్సి ఉంది. న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య కేవలం రెండు పాయింట్ల మాత‍్రమే అంతరం ఉంది. దాంతో పాకిస‍్తాన్‌తో జరిగే సిరీస్‌ను కివీస్ 2-1తో గెలవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment