క్రికెటర్ ను వణికించిన భూకంపం | Shaken up by earthquake in Delhi, Virender Sehwag forced to have lunch 'sitting outside' | Sakshi
Sakshi News home page

క్రికెటర్ ను వణికించిన భూకంపం

Published Tue, Oct 27 2015 1:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

క్రికెటర్ ను వణికించిన భూకంపం

క్రికెటర్ ను వణికించిన భూకంపం

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని వణికించిన భూకంపం భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను(37) భయపెట్టింది. ఢిల్లీలో సంభవించిన భూ ప్రకంపనలకు సెహ్వాగ్ ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశాడు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో  భూకంపం వచ్చిందని, బయటికి వచ్చి లంచ్ చేశానని సెహ్వాగ్ చెప్పాడు. ఆ సమయంలో ఆందోళనకు గురయ్యాయని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సోమవారం మధ్యాహ్నం సుమారు 2.50 నిమిషాలకు భూకంపం గురించి మూడు ట్వీట్లు చేశాడు. రంజీ  మ్యాచ్ అనంతరం వీరూ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లాడు. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో సోమవారం భూకంపం సంభవించిన సమయంలో సెహ్వాగ్ ఢిల్లీలోనే ఉన్నాడు. ఢిల్లీ, పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వణికిపోయాయి.

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌ తోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వీరూ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రంజీ ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో మైసూరులో ఆదివారం జరిగిన మ్యాచులో చెలరేగి ఆడిన  నవాబ్ ఆఫ్ నజఫ్‌గఢ్‌  సెహ్వాగ్.. అద్భుతమైన సెంచరీ చేశాడు. సెహ్వాగ్ హర్యానా జట్టుకు ఆడుతున్నా అతని సెంచరీని మైసూరు అభిమానులు ఆస్వాదించారు. అతను బౌండరీలు బాదుతుంటే అక్కడి అభిమానులు ఉత్సాహపర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement