అలవాటు మారలేదు!
సరదాగా...
లండన్: షేన్ వార్న్... మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో ఈ ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టించేవాడో తెలిసిందే... మైదానం బయట కూడా ఈ 45 ఏళ్ల ‘సోగ్గాడు’ అంతే ఫాస్ట్‌గా ముద్దుగుమ్మలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నాడు. కట్టుకున్న భార్యకు ఎప్పుడో విడాకులు ఇచ్చిన వార్న్ 2011 నుంచి 2013 వరకు ఇంగ్లండ్ నటి ఎలిజబెత్ హర్లీతో తెగ తిరిగాడు. పెళ్లి ఖాయం అనుకున్న సమయంలో తను మరో అమ్మాయితో ఎంగేజ్ అయిన విషయం తెలిసి హర్లీ ఛీ.. పొమ్మంది.
అయితే ఇప్పుడు తను ఖాళీగా ఉన్నాడనుకుంటే పొరపాటే.. స్మార్ట్ ఫోన్ యాప్స్ యుగంలో తన అమ్మాయిల వ్యామోహాన్ని కూడా అంతే స్మార్ట్‌గా తీర్చుకుంటున్నాడు. ‘టిండర్’ అనే డేటింగ్ అప్లికేషన్‌ను తన మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న వార్న్ ఇప్పటికే ఇద్దరు ముగ్గురమ్మాయిలతో షికార్లకు వెళ్లొచ్చినట్టు ‘ది టైమ్స్’ మేగజైన్‌కు చెప్పుకున్నాడు. నిజానికి ఈ యాప్‌లో తన పేరును చూసి అమ్మాయిలు నిజమైన వార్న్ అంటే నమ్మడం లేదట. షేన్‌వార్న్ పిల్లల్లో పెద్దమ్మాయికి 18 ఏళ్లు. అయినా ఈ సోగ్గాడు తన సరదాలు మానడం లేదు.