
ట్రైన్‌లో ప్రయాణిస్తున్న శార్దుల్ ఠాకూర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : భారత్‌లో క్రికెటర్లకున్న క్రేజ్ అంత ఇంత కాదు. ఐపీఎల్‌లో ఆడిన క్రికెటర్‌నే సెలబ్రిటీగా భావించే మనదేశంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడి గుర్తింపు పొందిన ఓ యువ క్రికెటర్‌ను గుర్తుపట్టలేకపోయారు. చివరికి గూగుల్‌లో వెతికి స్టార్ క్రికెటర్ అని షాకయ్యారు. ఆ క్రికెటరే యువ పేసర్ శార్దుల్ ఠాకూర్. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించిన ఈ యువ క్రికెటర్ పర్యటననంతరం ముంబై, అంధేరిలో లోకల్ ట్రైన్ ఎక్కాడు. భారత జట్టుకు ఆడిన క్రికెటర్ ట్రైన్ ఎందుకు ఎక్కుతారులే అనుకున్నారో ఎమో కానీ శార్దుల్‌ను ట్రైన్‌లోని జనాలు గుర్తుపట్టలేకపోయారు.! ఈ విషయం శార్దులే స్వయంగా ఓ చానల్‌కు తెలిపాడు. అయితే అప్పటికే శార్దుల్ లోకల్ ట్రైన్ ఎక్కిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం ఇంటికి వెళ్లడానికి నేను అంధేరి రైల్వేస్టేషన్‌లో ఓ లోకల్ ట్రైన్ ఎక్కాను. ఓ బాలుడు భారత్‌జట్టుకు ఆడుతున్న క్రికెటర్ ట్రైన్‌లో మనతో ప్రయాణిస్తున్నాడని అందరికి తెలిపాడు. కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రయాణీకులంతా శార్దుల్ ఠాకురేనా కదా అని నన్ను తదేకంగా చూసారు. కొంత మంది కాలేజీ కుర్రాళ్లు గూగుల్‌లో నా పేరు వెతికి నేనేనని గుర్తించి సెల్పీలు అడిగారు.’ అని శార్దుల్ పేర్కొన్నాడు.
భారత క్రికెటర్ ట్రైన్‌లో ప్రయాణించడం ఏమిటని చాలమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని, కానీ నా గత ప్రయాణమంతా ట్రైన్‌లోనే గడిచిందని, అట్టుడగు స్థాయి నుంచే వచ్చానని శార్దుల్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment