దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మరోసారి ఏకగ‍్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం తొలిసారి ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన మనోహర్.. రెండోసారి ఆ బాధ్యతను స్వీకరించనున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆయన్ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు ట్వీటర్ ద్వారా వెల్లడించింది. ఐసీసీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయడంతో బోర్డు డైరెక్టర్లందరూ మనోహర్ ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు.ఆయన నియామకం తక్షణమే అమల్లోకి రానుంది.
2016లో మొదటిసారి ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఏకగీవ్రంగా ఎన్నికైన మనోహర్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. కాగా, మనోహర్‌ను మరోసారి ఎన్నుకుంటూ ఐసీసీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీనికి బోర్డు డైరెక్టర్లందరూ ఏకగీవ్రంగా ఆమోదం తెలపడంతో మనోహర్ తిరిగి చైర్మన్‌గా నియమితులయ్యారు. దాంతో మరో రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్ హోదాలో మనోహర్ కొనసాగనున్నారు. తనను ఐసీసీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నుకోవడంపై మనోహర్ కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐసీసీ డైరెక్టర్లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన మనోహర్.. గతంలో ఏ రకంగా అయితే పని చేశానో, అదే తరహాలో పని చేస్తానని హామీ ఇచ్చారు. రాబోవు రెండేళ్ల కాలంలో ఐసీసీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానన‍్నారు.
Comments
Please login to add a commentAdd a comment