
బీసీసీఐ అధ్యక్షునిగా శశాంక్
ముంబై: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. బోర్డు అధ్యక్ష పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో బోర్డు అత్యున్నత పదవి ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) లో బోర్డు అధ్యక్షున్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా అనేకమంది పేర్లతో ఊహాగానాలు వినిపించినా ఆఖరికి శశాంక్ మనోహర్ ఒక్కరే బరిలోనిలవడంతో ఆయన రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. ఈస్ట్ జోన్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. ఈస్ట్ జోన్‌లోని ఆరు సంఘాలు వేర్వేరుగా మనోహర్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి మనోహర్ గతంలో 2008-09, 2010-11లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.